రెండో పెళ్లి వద్దన్న పవన్ అభిమానికి ఘాటైన సమాధానం ఇచ్చిన రేణూ దేశాయ్!
- ఇటీవల రెండో పెళ్లికి సిద్ధమన్న సంకేతాలు ఇచ్చిన రేణు
- అలా చేస్తే తన దేవుడికి సమస్య వస్తుందన్న ఓ అభిమాని
- క్రేజీ... అంటూ స్పందించిన రేణు దేశాయ్
- వారి మానసిక ఆరోగ్యం గురించి చింతిస్తున్నానని వ్యాఖ్య
ఇక మరో అభిమాని స్పందిస్తూ, "మీరు ఇంకో పెళ్లి చేసుకుంటే గొడవలు వస్తాయి. నా దేవుడికి ఎలాంటి సమస్యా రాకూడదు. ఏం చేసినా ఆలోచించి చేయండి" అని వ్యాఖ్యానించగా, "క్రేజీ" అని రేణు కామెంట్ పెట్టింది. ఇక పలువురు ఆమె వివాహానికి మద్దతిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటే, తనకు మద్దతిస్తున్న అబ్బాయిలకు పేరుపేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉందని పేర్కొంది. వారి తల్లిదండ్రులు వారిని చాలా చక్కగా పెంచారని కితాబిచ్చింది.