రొమాంటిక్ ఎంటర్టైనర్ లో ఛాన్స్ కొట్టేసిన సురభి
- ఆది హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్
- కథానాయికగా సురభి
- వచ్చేనెలలో రెగ్యులర్ షూటింగ్
తాజాగా సురభి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్లో చేయడానికి అంగీకరించింది. శ్రీనివాస నాయుడు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఆమె ఆది సాయికుమార్ కు జోడీగా కనిపించనుంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ మధ్య కాలంలో వరుస పరాజయాలతో ఆది సాయికుమార్ సతమతమైపోతున్నాడు. సురభి కూడా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది. ఈ ఇద్దరి ఆశలను ఈ సినిమా నెరవేరుస్తుందేమో చూడాలి.