దూకుడు పెంచిన నిహారిక .. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్
- నిహారిక తాజా చిత్రంగా 'హ్యాపీ వెడ్డింగ్'
- నెక్స్ట్ మూవీ దర్శకురాలిగా సుజన
- ఆ తరువాత రాహుల్ విజయ్ జోడీగా
ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే నిహారిక మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసింది. సుజన దర్శకత్వం వహించనున్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీలో శ్రియతో కలిసి నిహారిక చేయనుంది. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే తాజాగా మరో ప్రాజెక్టుకు ఓకే చెప్పేసింది. నిర్వాణ సినిమాస్ వారు తమ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రణీత దర్శకురాలిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో కథానాయకుడిగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టులు సెట్స్ పైకి వెళ్లనున్నాయి.