సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజ సినిమా షూటింగులో ఇలియానా
- ప్రభాస్ సినిమా కోసం యూరప్ వాతావరణం!
- నిర్మాతగా మారిన అందాలతార
* ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహో' చిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో యూరప్ వాతావరణాన్ని తలపించే విధంగా సెట్స్ ను వేస్తున్నారు. ఈ చిత్రం యూరప్ నేపథ్యంలో ఎక్కువగా సాగుతుంది. దాంతో అక్కడి ఇంటి నిర్మాణాలను.. రోడ్లను తలపించే విధంగా భారీ సెట్స్ ను వేస్తున్నారట.
* అందాలతార శ్రుతిహాసన్ నిర్మాతగా కూడా మారుతోంది. 'ది మస్కిటో ఫిలాసపీ' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి జయప్రకాష్ రాధాకృష్ణన్ దర్శకత్వం వహిస్తారని, ఈ కథ తనకు బాగా నచ్చడంతో నిర్మించడానికి పూనుకున్నానని శ్రుతి చెప్పింది.