బాలికపై లైంగిక దాడి.. కొరియోగ్రాఫర్ అరెస్ట్
- 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసిన ఆదిత్య
- ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం
- ఆదిత్యపై పోస్కో చట్టం కింద కేసు నమోదు
తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. ముంబైలోని బాబా హాస్పిటల్ లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆమె అత్యాచారానికి గురైనట్టు తేలింది. గత ఆదివారం బాధితురాలిని మెక్ డొనాల్డ్స్ కు రావాలని ఆదిత్య పిలిచాడు. అక్కడి నుంచి నలసోపారా లోని నివాసానికి తీసుకెళ్లాడు. ఆహారంలో మత్తు మందు కలిపి ఇచ్చి, ఆపై రేప్ చేశాడు. అనంతరం లోకల్ ట్రైన్ లో అంధేరికి తీసుకొచ్చి ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. అత్యాచారానికి పాల్పడ్డ ఆదిత్యను అరెస్ట్ చేసి, పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.