నిర్మాతగా సంపత్ నంది .. 'పేపర్ బాయ్' ఫస్టు లుక్ రిలీజ్
- సంతోష్ శోభన్ హీరోగా 'పేపర్ బాయ్'
- దర్శకుడిగా వి. జయశంకర్
- జూలైలో విడుదల చేసే ఆలోచన
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటించగా, ప్రియశ్రీ .. తన్యహోప్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇటీవలే షూటింగ్ పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జూలైలో విడుదల చేసే ఆలోచనలో వున్నారు. హైదరాబాద్ .. ముంబై .. లోనావాలా .. పూణె .. కేరళ .. గోవా ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ కొనసాగిందనీ, మంచి అవుట్ ఫుట్ వచ్చిందని నిర్మాతలు అన్నారు. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.