'పంతం' ఆడియో వేడుకకి వేదిక ఖరారు
- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- వచ్చేనెల 5వ తేదీన విడుదల
వచ్చేనెల 5వ తేదీన ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా పాటల పండుగ జరపాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. ఈ నెల 21వ తేదీన ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'సిద్ధార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్' ప్రాంగణంలో ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఆడియో వేడుక మొదలవుతుంది. గోపీసుందర్ అందించిన సంగీతం ఏ స్థాయిలో మెప్పిస్తుందో .. ఎన్నేసి మార్కులు తెచ్చేసుకుంటుందో చూడాలి.