'ఈ నగరానికి ఏమైంది?' విడుదల తేదీ ఖరారు
- 'పెళ్లిచూపులు'తో హిట్ కొట్టిన తరుణ్ భాస్కర్
- రెండవ సినిమాగా 'ఈ నగరానికి ఏమైంది?'
- ఈ నెల 29వ తేదీన విడుదల
ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. కథ .. కథనాలు .. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రధానబలంగా నిలుస్తాయని అంటున్నారు. తరుణ్ భాస్కర్ తొలిచిత్రమైన 'పెళ్లి చూపులు' ఘన విజయాన్ని సాధించడమే కాకుండా ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. దాంతో సహజంగానే 'ఈ నగరానికి ఏమైంది' సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమాతోను తరుణ్ భాస్కర్ సంచలనానికి తెరతీస్తాడేమో చూడాలి.