విజయవాడలో ఆడియో రిలీజ్ .. విశాఖలో ప్రీ రిలీజ్
- గోపీచంద్ హీరోగా 'పంతం'
- కథానాయికగా మెహ్రీన్
- వచ్చేనెలలో రిలీజ్
త్వరలోనే ఈ సినిమా ఆడియో వేడుకను విజయవాడలో నిర్వహించనున్నారు. అలాగే ఈ నెలాఖరులో విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరపనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. జూలై 6వ తేదీన గానీ .. లేదంటే ఒకరోజు ముందుగా గాని ఈ సినిమాను విడుదల చేయనున్నారు. కొంతకాలంగా సక్సెస్ లు పలకరించకపోవడంతో గోపీచంద్ అభిమానులు నిరాశతో వున్నారు. గోపీచంద్ నుంచి వాళ్లు ఆశిస్తోన్న విజయం ఈ సినిమాతో దొరుకుతుందేమో చూడాలి.