త్రిష నాయికగా సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో సినిమా!
- తెలుగులో అవకాశాలు లేని త్రిష
- తమిళంలో అడపా దడపా ఛాన్సులు
- త్వరలో తెలుగులోకి రీ ఎంట్రీ
'శతమానం భవతి' సినిమాతో విజయాన్ని అందుకున్న సతీశ్ వేగేశ్న తాజాగా నితిన్ హీరోగా 'శ్రీనివాస కల్యాణం' సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయనున్నాడట. ఆ సినిమా కోసమే ఆయన త్రిషను సంప్రదించడం .. కథ తన పాత్ర చుట్టూనే తిరిగేది కావడంతో ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడని చెబుతున్నారు.