అలా హిట్ మూవీ చేజారిపోయింది: సుధీర్ బాబు
- ఇంద్రగంటితో నా రెండో మూవీ చేయాల్సింది
- ఆ సినిమాకి అవసరాల స్క్రిప్ట్ అందించాడు
- కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది
"నా మొదటి సినిమా 'ఎస్సెమ్మెస్' విడుదలకు వారం రోజుల ముందుగా నేను రెండో సినిమాకి సైన్ చేశాను. ఆ సినిమాకి మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడైతే .. స్క్రిప్ట్ ను అందించినది అవసరాల శ్రీనివాస్. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తరువాత కొంతకాలానికి ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి, దర్శకుడిగా ఆ సినిమాను అవసరాల శ్రీనివాస్ తెరకెక్కించాడు. ఆ సినిమాయే 'ఊహలు గుసగుసలాడే' .. నాగశౌర్య - రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అలా ఒక మంచి సినిమా చేజారిపోయింది" అని చెప్పుకొచ్చాడు.