రాజశేఖర రెడ్డి బయోపిక్ లో సుహాసిని?
- షూటింగు దశలో 'యాత్ర'
- ప్రధాన పాత్రలో మమ్ముట్టి
- సూరీడు పాత్రలో పోసాని
ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య పాత్ర కోసం 'ఆశ్రిత వేముగంటి'ని ఎంపిక చేసుకున్నారు. 'బాహుబలి 2' సినిమాలో 'కన్నా నిదురించరా ..' అనే పాటలో అనుష్కతో పాటు ఆశ్రిత వేముగంటి మెరిసింది. ఈ పాటతో ఆమె అందరినీ తనవైపుకు తిప్పుకుంది. ఇక ఈ సినిమాలో సబితా ఇంద్రారెడ్డి పాత్ర కూడా కీలకంగా కనిపించనుంది. ఈ పాత్ర కోసం సుహాసినిని ఎంపిక చేశారనేది తాజా సమాచారం. పాత్రకి గల ప్రాధాన్యత కారణంగానే సుహాసిని అంగీకరించిందని అంటున్నారు. వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణమురళిని తీసుకోవడం కూడా ఆసక్తిని రేకెత్తించే అంశమేనని చెప్పాలి.