శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలనుందట!
- అదితీరావు కథానాయికగా 'సమ్మోహనం'
- రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ
- శేఖర్ కమ్ముల సినిమాలంటే ఇష్టం
సాధారణంగా ఇదే ప్రశ్నకి రాజమౌళి పేరునో .. సుకుమార్ పేరునో చెప్పేవారు ఎక్కువగా వుంటారు. కానీ అదితీరావు అందుకు భిన్నంగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాలని ఉందని చెప్పింది. శేఖర్ కమ్ముల కథాకథనాలను తయారు చేసుకునే తీరు .. వాటిని తెరపై ఆవిష్కరించే విధానం తనకి బాగా నచ్చుతాయని అంది. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రకి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందనీ, అందువలన ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే ఎలాంటి పరిస్థితుల్లోను వదులుకోనని చెప్పింది. శేఖర్ కమ్ముల మూవీలో చేయాలనే ఈ సుందరి ముచ్చట ఎప్పుడు తీరేనో .. ఏమో.