taj mahal: తాజ్ మహల్ ద్వారాన్ని ధ్వంసం చేసిన వీహెచ్పీ

  • తాజ్ లోని శివాలయంలోకి వెళ్లే దారిని మూసేస్తున్నారంటూ దాడి
  • పశ్చిమ ద్వారాన్ని ధ్వంసం చేసిన వీహెచ్పీ
  • 30 మందిపై కేసు నమోదు

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ పశ్చిమ ద్వారాన్ని వీహెచ్పీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. 400 ఏళ్ల నాటి శివాలయంలోకి అనుమతించే దారిని మూసేస్తున్నారనే ఆరోపణలతో వారు ఈ చర్యకు దిగారు. పురాతన శివాలయంలోకి వెళ్లే దారిని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మూసివేస్తోందనేది వీహెచ్పీ సభ్యుల ప్రధాన ఆరోపణ.

ఆలయానికి వెళ్లేందుకు మరో మార్గం ఉందని పోలీసులు చెబుతున్నా... వీహెచ్పీ కార్యకర్తలు పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూ, విధ్వంసానికి పాల్పడ్డారు. కొత్తగా ఏర్పాటు చేసిన గేటుపై సుత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. గేట్ ను తొలగించి, 50 మీటర్ల దూరానికి విసిరివేశారు. అక్కడ ఉన్న సీసీటీవీని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు 30 మందిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం నిరోధక చట్ట సవరణలో సెక్షన్ 7 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఇంత వరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు.

  • Loading...

More Telugu News