'చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు'.. తన కూతురు, కుమారుడితో రవితేజ ఫొటో వైరల్
- శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ కొత్త సినిమా
- ప్రస్తుతం థాయిలాండ్‌లో మాస్ మహారాజా
- కూతురు, కొడుకుతో ఫొటోలు
'మూడు కోతులు'లా రవితేజ తన పిల్లలతో దిగిన ఫొటో అలరిస్తోంది. తన కూతురు చెవులు మూసుకోగా, రవితేజ నోటిపై చేతులు పెట్టుకున్నాడు.. ఇక ఆయన కుమారుడు కళ్లు మూసుకున్నాడు. 'చెడు వినవద్దు, అనవద్దు, కనవద్దు' అనేలా పోజులిచ్చి రవితేజ తీసుకున్న ఫొటో అలరిస్తోంది.
అలాగే, మరికొన్ని ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి.