స్టార్ హీరోలతో సినిమాలు తగ్గించనున్న త్రివిక్రమ్?
- అగ్ర దర్శకుడిగా త్రివిక్రమ్
- పెద్ద హీరోలతోనే ఎక్కువ సినిమాలు
- కొత్త కథలు .. పాత్రలపై దృష్టి
ఈ సినిమా తరువాత ఆయన నాని హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఆయన ఆ స్థాయి హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడనేది తాజా సమాచారం. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే .. కథను వాళ్ల చుట్టూనే అల్లుకోవలసి వస్తోంది. అలా ఉంటేనే అభిమానులు అంగీకరిస్తారు కూడా. అందువలన మీడియం రేంజ్ హీరోలతో అయితే కథల పరంగాను .. పాత్రల పరంగాను కొన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నాడట. అందువలన ఎక్కువగా వాళ్లతో .. అడపా దడపా స్టార్ హీరోలతో చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు.