'w/o రామ్' సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ ట్రైలర్
- మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో 'w/o రామ్'
- మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే కథ
- ముఖ్యమైన పాత్రలో ఆదర్శ్ బాలకృష్ణ
ఈ సినిమాలో ఆమె భర్త పాత్ర హత్య చేయబడుతుంది. ఆ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి ఒక వైపున పోలీసులు ప్రయత్నిస్తుంటే .. మరో వైపున ఆమె కూడా తన ప్రయత్నం తాను చేస్తుంటుంది. అదే విషయాన్ని ఈ ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది .. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా వుంది. మంచు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో, ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.