గల్లా జయదేవ్ ఛాలెంజ్ ను అంగీకరిస్తున్నా: హీరో సుమంత్
- ‘హగ్ ఏ ట్రీ’ ఛాలెంజ్ కు స్పందించిన సుమంత్
- సుమంత్ ను అనుకరించేందుకు యత్నించిన పెంపుడు శునకం
- మరో ఐదుగురికి ఛాలెంజ్ విసిరిన హీరో
ఓ చెట్టును సుమంత్ హగ్ చేసుకోగా, ఆయన పెంపుడు శునకం కూడా అదే చెట్టుపై తన రెండు కాళ్లు పెట్టి నిలబడింది. ఈ ఫొటోను సుమంత్ పోస్ట్ చేశారు. కాగా, తన ఛాలెంజ్ కు స్పందించినందుకు, ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నందుకు సుమంత్ కు గల్లా జయదేవ్ కృతఙ్ఞతలు చెప్పారు.