బోయపాటి మూవీలో సిక్స్ ప్యాక్ తో చరణ్ ?
- బోయపాటి దర్శకత్వంలో చరణ్
- ముఖ్య పాత్రల్లో స్నేహ .. ప్రశాంత్
- సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన
ఈ సినిమాలో చరణ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ప్రముఖ ఫిట్ నెస్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్ దగ్గర ఆయన ప్రత్యేక శిక్షణ పొందుతున్నట్టుగా చెబుతున్నారు. చరణ్ ను మరోమారు సిక్స్ ప్యాక్ లో చూడాలనే అభిమానుల ముచ్చట ఈ సినిమా ద్వారా తీరనుందన్న మాట. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రశాంత్ .. స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నారు.