ముక్కుకి సర్జరీ చేయించుకున్నాను.. మరో సిటింగ్ లోపు ఆ డాక్టర్ చనిపోయారు!: నటుడు జయప్రకాశ్ రెడ్డి
- చిన్నప్పుడు నాది చట్టిముక్కు అనేవారు
- సినిమాల్లోకి వచ్చాక సర్జరీ చేయించుకోమన్నారు
- ఆ ప్రయత్నం కొంతవరకే ఫలించింది
ఈ విషయాన్ని నా సన్నిహితుడి దగ్గర ప్రస్తావిస్తే, ఆయన ఒక మంచి కేరళ సర్జన్ దగ్గరికి తీసుకెళ్లాడు. నిజంగానే ఆయన చాలా గొప్ప సర్జన్ .. ఇది చాలా సింపుల్ సర్జరీ అంటూ ఆయన ఒక సిటింగ్ లో కొంతవరకూ చేసేశారు. 6 నెలల తరువాత మరో సిటింగ్ లో ముక్కు పై భాగాన్ని సెట్ చేద్దామని చెప్పారు. కానీ పాపం ఆ డాక్టర్ ఆ తరువాత కారు ప్రమాదంలో చనిపోయారు. ఇక వేరే డాక్టర్ దగ్గరికి నేను వెళ్లలేదు" అని చెప్పుకొచ్చారు.