మా తాత ఇచ్చింది 20 ఎకరాలు .. మా నాన్న 18 ఎకరాలు అమ్మేశాడు!: నటుడు జయప్రకాశ్ రెడ్డి
- మా నాన్న చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్
- ఉన్న ఆస్తులన్నీ అమ్మేశారు
- అయినా మేము బాధపడింది లేదు
"మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా అనేక ప్రాంతాల్లో పనిచేశారు. ఆయన సర్వీస్ అయిపోయేటప్పటికి .. మా తాతగారు వ్యవసాయం చేసే 20 ఎకరాల్లో మా నాన్న 18 ఎకరాలు అమ్మేశారు .. ఇక మిగిలింది 2 ఎకరాలు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆయన ఎవరింట్లోను టీ కూడా తాగేవారు కాదు .. లంచం తీసుకునేవారు కాదు.
ఆయన చాలా స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ .. అందుకు మేమంతా ఎంతో సంతోషిస్తూ ఉంటాం. మా నాన్న సంపాదించకపోగా ఉన్నదంతా అమ్మేశాడే అని మేము ఏ రోజున అనుకోలేదు. మా నాన్నగారి నీతి .. నిజాయతి మమ్మల్ని ఈ రోజున ఈ స్థాయిలో ఉంచాయని మేమంతా నమ్ముతుంటాం" అని చెప్పుకొచ్చారు.