నాకు ఒక్కడే కొడుకు .. డాక్టర్ చెప్పింది విని షాక్ అయ్యాము!: పృథ్వీరాజ్
- మా బాబు చాలా ముద్దుగా ఉండేవాడు
- వాడిని చూసి మురిసిపోయే వాళ్లం
- కానీ ఓ చేదు నిజాన్ని అంగీకరించవలసి వచ్చింది
"మా బాబు చాలా అందంగా ఉండేవాడు .. వాడిని చూసి మేము మురిసిపోయేవాళ్లం. కానీ ఒక రోజున వాడిని చూసిన మా నాన్నకి ఏదో అనుమానం వచ్చింది. ఆయన మాట మేరకు బాబును హాస్పిటల్ కి తీసుకెళ్లాం. మా బాబుకు మానసికపరమైన ఎదుగుదల లేదనే విషయం తెలిసి షాకయ్యాము. దగ్గరుండి అన్ని విషయాలు మేమే చూసుకోవాలని డాక్టర్ చెబితే .. బాధను భరిస్తూనే ఆ నిజాన్ని స్వీకరించాం. ఆ బాబు కోసమే సమయమంతా కేటాయించాలి గనుక ఒక్కరు చాలనుకున్నాం .. ఇప్పుడు వాడి వయసు 22 యేళ్లు" అంటూ చెప్పుకొచ్చారు.