kareena kapoor: కరీనా కపూర్ దృష్టిలో ఫిట్ అండ్ హాట్ క్రికెటర్ ఎవరో తెలుసా?

  • విరాట్ కోహ్లీ ఫిట్ గా, హాట్ గా ఉంటాడు
  • కేన్ విలియంసన్ కూడా హాట్ గా ఉంటాడు
  • నా భర్త సైఫ్ అంటే నాకు చాలా ఇష్టం

తన మనసులో ఉన్న భావాలను, అభిప్రాయాలను ముక్కుసూటిగా చెబుతుందన్న కితాబు బాలీవుడ్ నటి కరీనా కపూర్ కు ఉంది. కరీనా తాజా చిత్రం 'వీర్ డి వెడ్డింగ్' జూన్ 1న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ లో ఆమె చాలా బిజీగా ఉంది. ఈ క్రమంలో ఓ టాక్ షోలో కరీనా కపూర్ పలు విషయాలను పంచుకుంది.

ఈ సందర్భంగా బాగా ఫిట్ గా ఉండే క్రికెటర్ ఎవరు? అనే ప్రశ్న ఆమెకు ఎదురైంది. దీనికి ఏ మాత్రం తడుముకోకుండా... విరాట్ కోహ్లీ అని సమాధానమిచ్చింది. విరాట్ ఫిట్ గా ఉండటమే కాకుండా, చాలా హాట్ గా కూడా ఉంటాడని చెప్పింది. మరో క్రికెటర్ కేన్ విలియంసన్ కూడా చాలా హాట్ గా ఉంటాడని చెప్పింది. తన భర్త సైఫ్ ను తాను చాలా ప్రేమిస్తానని తెలిపింది. 

kareena kapoor
Virat Kohli
saif ali khan
bollywood
  • Loading...

More Telugu News