సక్సెస్ లేనప్పుడు ఓ పెళ్లికి వెళ్లాను .. ఒక్కరు కూడా ఆటోగ్రాఫ్ అడగలేదు: 'పెళ్లి' పృథ్వీరాజ్
- సక్సెస్ తో వుండే గౌరవం వేరు
- అది లేకపోతే వుండే పరిస్థితి వేరు
- అంతా సక్సెస్ తోనే ముడిపడి ఉంటుంది
సక్సెస్ వున్నప్పుడు .. లేనప్పుడు ఎలాంటి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయంపై ఆయన స్పందిస్తూ .. " సక్సెస్ ఉన్నప్పుడు సెట్ కి వెళితే .. రండి సార్ కూర్చోండి అంటారు. జ్యూస్ అని అరిస్తే పరిగెత్తుకెళ్లి తెస్తారు. సక్సెస్ లేనప్పుడు మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా వెళ్లిపోతారు. ఒకసారి నేను సక్సెస్ లతో వున్నప్పుడు ఒక ఫంక్షన్ కి వెళితే ఆటోగ్రాఫ్ అంటూ అంతా ఎగబడ్డారు. ఆ తరువాత కొంతకాలానికి నేను సినిమాలు కాదు గదా సీరియల్స్ కూడా చేయడం లేదు. అలాంటప్పుడు ఒక పెళ్లికి వెళ్లాను .. అంతా నన్ను చూస్తూ అటు నుంచి ఇటు .. ఇటు నుంచి అటు వెళ్లారే గానీ ఒక్కరూ ఆటోగ్రాఫ్ అడగలేదు" అంటూ చెప్పుకొచ్చారు.