మా అబ్బాయి ఈ మూవీ చేయకుండా నేనే ఆపాను: రవితేజ
- 'నేల టిక్కెట్టు'తో పలకరించనున్న రవితేజ
- సెట్స్ పై 'అమర్ అక్బర్ ఆంటోని'
- అందుకే మా అబ్బాయిని వద్దన్నాను
'రాజా ది గ్రేట్' లో మా అబ్బాయి మహాధన్ చాలా బాగా చేశాడు. దాంతో 'అమర్ అక్బర్ ఆంటోని'లోను ఒక పాత్ర చేయిద్దామని శ్రీను వైట్ల అన్నారు. వేసవి సెలవులు కదా అని అందుకు నేను కూడా అంగీకరించాను. కానీ ఈ సినిమా షెడ్యూల్స్ లో జరిగిన మార్పు కారణంగా, స్కూల్స్ ఓపెన్ చేసిన తరువాత వాడు షూటింగులో పాల్గొనవలసి ఉంటుంది. స్కూల్ మాన్పించి యాక్టింగ్ చేయించడం నాకు ఇష్టం లేదు .. అందుకే ఈ సినిమా చేయవద్దులే అని నేనే అన్నాను" అంటూ అసలు సంగతి చెప్పుకొచ్చాడు.