సీట్లు తక్కువగా వచ్చినందుకే కాంగ్రెస్-జేడీఎస్ సంబరాలు చేసుకుంటున్నాయా?: అమిత్ షా ఎద్దేవా
- కర్ణాటకలో మా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది
- పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు
- 122 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు 78కి పడిపోయాయి
ఎన్నికల ముందు 122 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ సీట్లు 78కి పడిపోయాయని, మరోవైపు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. జేడీఎస్‌కి కూడా కేవలం 37 సీట్లే వచ్చాయని, తక్కువ సీట్లు వచ్చినందుకే ఆయా పార్టీలు వేడుకలు చేసుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్-జేడీఎస్ అపవిత్ర కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని అన్నారు.