అంజలి ప్రధాన పాత్రగా మరో హారర్ మూవీ
- ద్విభాషా చిత్రంలో అంజలి
- త్రీడీలో హారర్ కథా నేపథ్యం
- గతంలో అంజలి ఖాతాలో 'గీతాంజలి'
తెలుగు .. తమిళ భాషల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి 'లిసా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు ... తమిళ భాషలపై అంజలికి మంచి పట్టు వుంది. ఈ రెండు భాషల్లోను ఆమెకి మంచి క్రేజ్ వుంది. అంతే కాకుండా గతంలో ఆమె చేసిన 'గీతాంజలి' వంటి హారర్ మూవీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. త్రీడీ హారర్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా ద్వారా రాజు విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.