సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రవితేజ సినిమా నుంచి అనూ ఇమ్మానుయేల్ ఔట్!
- మల్టీ స్టారర్ రిలీజ్ డేట్ ఖరారు
- యంగ్ హీరో సినిమాలో సునీల్
* నాగార్జున, నాని హీరోలుగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్టారర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన కాలనీ సెట్లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
* హీరోగా సక్సెస్ కాలేకపోయిన కమెడియన్ సునీల్ తిరిగి హాస్య పాత్రలను పోషిస్తున్నాడు. ఇప్పటికే 'అమర్ అక్బర్ ఆంటోనీ', 'సిల్లీ ఫెలోస్' చిత్రాలలో నటిస్తున్న సునీల్ తాజాగా శర్వానంద్ నటిస్తున్న 'పడిపడి లేచే మనసు' చిత్రంలో కూడా ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు.