రిసార్టు నుంచి వెళ్లిపోయిన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే.. బీజేపీ క్యాంపుకి?
- బెంగళూరులోని ఓ రిసార్ట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- విమానాశ్రయం వెళ్లి విమానం ఎక్కిన మస్కి ఎమ్మెల్యే
- గాలి జనార్దన్ రెడ్డి సోదరుడే కారణం?
ఆయన కోసం కాంగ్రెస్ నాయకులు ఎంతగా ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేటు విమానంలో ఆయన ఎక్కడికో వెళ్లిపోయారని కాంగ్రెస్ నేతలు చివరకు గుర్తించారు. ఆయన 2013, 2018లో మస్కి నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, అంతకు ముందు 2008లో బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ప్రతాప్ గౌడ పాటిల్‌ను గాలి జనార్దన్ రెడ్డి సోదరుడే విమానం ఎక్కించారని తెలుస్తోంది.