త్వరలోనే త్రిష పెళ్లంటూ కోలీవుడ్ లో గుసగుసలు
- తమిళంలో వరుస సినిమాలతో త్రిష
- ఇటీవలే స్నేహితులతో కలిసి భారీగా షాపింగ్
- ఆ విషయంపై కొందరి ఊహాగానాలు
ఆ షాపింగ్ ఏదో సరదాగా చేసినట్టుగా లేదట .. అందువలన కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగేనని చెప్పుకుంటున్నారు. త్రిష కొంతకాలంగా ఒక బిజినెస్ మేన్ తో చనువుగా వుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. త్రిష తల్లి మాత్రం ఆ విషయాన్ని ఖండిస్తూనే వస్తోంది. ప్రస్తుతం త్రిష పూర్తి చేయవలసిన సినిమాలు మూడు వరకూ వున్నాయట. అవి పూర్తి కాగానే పెళ్లి సంగతి బయటికి చెప్పనుందని అంటున్నారు. అప్పటివరకూ వరుడు ఎవరనే సస్పెన్స్ ను భరించక తప్పదు.