యాక్షన్ హీరోతో మూడోసారి జోడీ కడుతోన్న అనుష్క?
- జయేంద్ర దర్శకత్వంలో గోపీచంద్
- ఆయన సరసన కథానాయికగా అనుష్క
- త్వరలో సెట్స్ పైకి
కల్యాణ్ రామ్ .. తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర 'నా నువ్వే' సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసుకున్నాడని సమాచారం. గతంలో గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'శౌర్యం' సినిమాలు చేసిన అనుష్కకి ఇది మూడవ సినిమా. ప్రస్తుతం 'పంతం' చేస్తోన్న గోపీచంద్ .. ఆ షూటింగు పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు.