రవితేజ కొత్త సినిమా ట్రైలర్ విడుదల
- అలరిస్తోన్న ‘నేల టిక్కెట్టు’ సినిమా ట్రైలర్
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా
- విలన్‌గా జగపతి బాబు
'ఎంత మంది కష్టాల్లో ఉన్నారో చూడరా.. కానీ సాయం చేసేవాడు ఒక్కడూ లేడు' అంటూ రవితేజ డైలాగు చెప్పడాన్ని ఈ ట్రైలర్ లో చూడచ్చు. ఇందులో రవితేజ వృద్ధులకు సాయం చేస్తూ వారి పక్షాన మాట్లాడుతున్నాడు. అలాగే, జగపతి బాబు ప్రతినాయకుడి పాత్రలో కనపడుతూ 'నేను ఎదగడానికి ఎంత మందినైనా తొక్కేస్తాను' అంటూ డైలాగు కొట్టాడు.