అదంతా అసత్యమే... మహేష్ బాబు నాకు బెస్ట్ ఫ్రెండ్!: రామ్ చరణ్
- మహేష్ తో పోటీ పడుతున్న రామ్ చరణ్
- జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డ మెగా హీరో
- ఎవరి కలెక్షన్లు ఎంతని లెక్కలు వేయడం లేదని వెల్లడి
తన చిత్రం 'రంగస్థలం', మహేష్ మూవీ 'భరత్ అనే నేను' రెండూ సూపర్ హిట్ కావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పాడు. పర్సనల్ హిట్ కొట్టడం కన్నా, ఇండస్ట్రీకి మరో హిట్ లభించిందన్న అంశమే తనకు ముఖ్యమని చెప్పాడు. కాగా, 'రంగస్థలం' విడుదలైన 20 రోజుల తరువాత 'భరత్ అనే నేను' విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత ఈ రెండు సినిమాల విడుదల తేదీ క్లాష్ కాగా, నిర్మాతలు కూర్చుని చర్చించుకుని సినిమాల మధ్య కనీసం మూడు వారాల గ్యాప్ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.