సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ఇట్టే కలసిపోతానంటున్న రకుల్
- బాలకృష్ణ, వినాయక్ చిత్రానికి ముహూర్తం
- హిట్ చిత్రానికి సీక్వెల్ మొదలు
* నందమూరి బాలకృష్ణ, వీవీ వినాయక్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఈ నెల 27న ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. సి.కల్యాణ్ నిర్మించే ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడట.
* ఐదేళ్ల క్రితం వచ్చిన 'ప్రేమకథా చిత్రం' అప్పట్లో విజయాన్ని సాధించింది. దీంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న ఈ 'ప్రేమకథా చిత్రం 2' సినిమాకి నూతన దర్శకుడు హరికిషన్ దర్శకత్వం వహిస్తున్నాడు.