సూర్య మూవీలో కీలకమైన పాత్రలో మోహన్ లాల్
- కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య
- ఈ కాంబినేషన్లో ఇది మూడో సినిమా
- త్వరలోనే సెట్స్ పైకి
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అవి తెలుగులో 'వీడొక్కడే' .. 'బ్రదర్స్' పేరుతో అనువాదాలుగా వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో మూడవ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి . ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉందట. ఈ పాత్ర సినిమాకి హైలైట్ గా నిలవనుండటంతో, స్టార్ ఇమేజ్ కలిగిన సీనియర్ హీరోతోనే ఈ పాత్రను చేయించాలని భావించిన దర్శకుడు, తాజాగా మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నట్టు ఈ సినిమాను నిర్మిస్తోన్న లైకా ప్రొడక్షన్స్ వారు చెప్పారు.