మా పాత 'పూరీ' ఎక్కడ?: 'మెహబూబా' చూసిన ఫ్యాన్స్ రియాక్షన్!
- నేడు రిలీజైన 'మెహబూబా'
- అభిమానుల మిశ్రమ స్పందన
- 'పూరీ ఈజ్ బ్యాక్' అనేలా మాత్రం లేదు
సినిమా చూసొచ్చిన అభిమానులు, 'మా పాత పూరీ ఎక్కడ?' అని ప్రశ్నిస్తున్నారు. రెండు జన్మల కథగా, 1971, 2018 సంవత్సరాలను కలుపుతూ తీసిన ఈ చిత్రం 'పూరీ ఈజ్ బ్యాక్' అనే స్థాయిలో లేదట. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుందని, ఫస్టాఫ్ సాదాసీదాగానే ఉందని, పెద్ద గొప్పగా ఏమీ లేదని సినిమా చూసిన వాళ్లు ట్విట్టర్ లో స్పందిస్తున్నారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి సినిమా ఫ్లాప్ అయిందని ట్వీట్లు పెడుతున్నారు.