అందుకే, రవితేజ అంటే నాకు ఇష్టం: పవన్ కల్యాణ్
- రవితేజ నటుడిగా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది
- రవితేజ సిగ్గుపడకుండా అవలీలగా నటించేస్తాడు
- నేను అలా నటించలేను
రవితేజను ఫస్ట్ టైమ్ అప్పుడు చూశా
‘నేను సినిమాల్లోకి రానప్పుడు.. వీధుల్లో తిరుగుతున్నప్పుడు అప్పటికే నటుడిగా ఉన్న రవితేజను చూశాను. అన్నయ్య చిరంజీవి తర్వాత ఓ నటుడిగా అంత దగ్గరగా రవితేజను మద్రాసులో చూసేవాడిని. ‘ఆజ్ కా గూండా రాజ్’ సినిమా విడుదలైనప్పుడు మద్రాసులో ఈ సినిమాను చూసేందుకు వెళ్లా. అప్పుడు, రవితేజను ఫస్ట్ టైమ్ చూశాను. అప్పటికి నేను నటుడిని కాదు కనుక నన్ను రవితేజ గుర్తించలేదు. రవితేజ అప్పటికే నటుడు కనుక నేను గుర్తించా’ అని పవన్ అనడంతో రవితేజ నవ్వులు చిందించాడు.