తెరపై రజనీకాంత్ వీరాభిమానిగా జ్యోతిక!
- రీ ఎంట్రిలోను సక్సెస్ అయిన జ్యోతిక
- విలక్షణమైన పాత్రలే కారణం
- మలయాళ హిట్ మూవీ పట్ల ఆసక్తి
ఇటీవల మలయాళంలో 'మోహన్ లాల్' అనే సినిమా వచ్చింది. ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో 'మోహన్ లాల్' అభిమాని పాత్రలో మంజు వారియర్ నటించి మెప్పించింది. ఈ సినిమా కథ .. ఆ పాత్ర నచ్చడంతో రీమేక్ లో చేయడానికి జ్యోతిక ఆసక్తిని చూపింది. ఈ సినిమాలో ఆమె రజనీకాంత్ అభిమానిగా కనిపిస్తుందట. హాస్యంతో కూడిన సందేశాత్మక చిత్రంగా ఈ సినిమా రూపొందుతోంది.