రవితేజను చూసే హీరో కావాలనుకున్నాను: ఆకాశ్
- రవితేజ అంటే నాకు ఎంతో ఇష్టం
- ఊహ తెలిశాక చూసినవి ఆయన సినిమాలే
- ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో వుంది
"రవితేజ గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసిన తరువాత నేను చూసినవి రవితేజ గారి సినిమాలే. ఆయనతో మా నాన్న చేసిన 'ఇడియట్' .. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి' సినిమాలు చూశాను. అప్పట్లో నా దృష్టిలో హీరో అంటే రవితేజనే .. నిజం చెప్పాలంటే ఆయనని చూసిన తరువాతనే నేను హీరోను కావాలనుకున్నాను. మా నాన్న .. రవితేజ ఇద్దరూ కూడా ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. వాళ్లిద్దరి నుంచి నేను నేర్చుకోవలసింది ఎంతో వుంది" అని చెప్పుకొచ్చాడు.