'నేల టిక్కెట్టు' ఆడియో వేడుకకి వేదిక ఖరారు
- కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'నేల టిక్కెట్టు'
- రవితేజకు జోడీగా మాళవిక శర్మ
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
హైదరాబాద్.. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో, ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు. అభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకకి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నాడు. దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ ఇప్పటికే రెండు హిట్లు కొట్టేసి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని మాళవిక శర్మ భావిస్తోంది. ఆమె ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.