నమ్మకం వుంది.. అందుకే ఇల్లు అమ్మేశా!: పూరీ జగన్నాథ్
- ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
- ప్రేమకథా నేపథ్యంతో కూడిన సినిమా
- త్వరలో ప్రేక్షకుల ముందుకు
తాజాగా ఈ విషయాన్ని గురించి పూరీ దగ్గర ప్రస్తావించగా, 'మెహబూబా' సినిమా కోసం ఇల్లు అమ్మేసిన మాట నిజమేనని చెప్పాడు. కొత్త కుర్రాడిపై డబ్బులు ఖర్చు చేయడానికి ఏ నిర్మాతైనా ఆలోచిస్తాడు .. ఒకవేళ ముందుకు వచ్చినా అనేక ఆంక్షలు ఉంటాయి. అందువలన అలాంటివి ఉండకూడదనే నేను ఒక ఇల్లు అమ్మేశాను. ఈ సినిమా కంటెంట్ మీద .. ఆకాశ్ మీద నాకు నమ్మకం వుంది .. అందుకే అలా చేశాను. ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా ఆలోచించను .. ఏదైనా తిరిగి సంపాదించుకోవడమెలాగో నాకు తెలుసు" అని చెప్పుకొచ్చారు.