ఎన్టీఆర్ బయోపిక్ కోసం మరాఠీ సీనియర్ నటుడు
- ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహకాలు
- కొనసాగుతున్న నటీనటుల ఎంపిక
- సంగీత దర్శకుడిగా కీరవాణి
నందమూరి తారకరామారావు రాజకీయ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల్లో నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్ ఒకటి. ఆ పాత్ర కోసం కొంతమంది సీనియర్ నటుల పేర్లను పరిశీలించిన ఈ సినిమా టీమ్, ప్రముఖ మరాఠీ నటుడు సచిన్ ఖేదేకర్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. వివిధ భాషా చిత్రాల్లో నటించిన ఆయనకి సహజ నటుడు అనే మంచి పేరుంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.