తేజు నో చెప్పిన కథకి ఓకే చెప్పిన యాక్షన్ హీరో!
- గోపీచంద్ తో చంద్రశేఖర్ యేలేటి
- గతంలో ఈ కాంబినేషన్లో రెండు సినిమాలు
- మూడో సినిమా కోసం సన్నాహాలు
కొన్ని రోజుల క్రితం చంద్రశేఖర్ యేలేటి .. తేజుకి ఒక కథను వినిపించాడట. ఆ సినిమా చేయాలా? వద్దా? అనే విషయంలో తర్జనభర్జనలు పడిన తేజు .. చివరికి నో చెప్పేశాడట. దాంతో చంద్రశేఖర్ యేలేటి ఆ కథను తీసుకుని గోపీచంద్ ను కలవడం .. ఆయన ఓకే చెప్పేయడం జరిగిపోయిందట. గతంలో చంద్రశేఖర్ యేలేటి .. గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన 'ఒక్కడున్నాడు' .. 'సాహసం' సినిమాలు అభిమానులను మెప్పించాయి. ఇక ఈ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా రానుండటం ఆసక్తిని రేకెత్తించే విషయమే.