'మెహబూబా' సెన్సార్ పూర్తి.. హ్యాపీగా ఉందన్న ఛార్మీ
- యూ/ఏ సర్టిఫికెట్ పొందిన పూరీ కొత్త చిత్రం
- సెన్సార్ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందన్న ఛార్మీ
- ఆకాశ్ చాలా బాగున్నాడని చెప్పారని వ్యాఖ్య
ఈ సందర్భంగా సినీ నటి ఛార్మీ.. తనకు చాలా హ్యాపీగా ఉందంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. తమ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుందని, సెన్సార్ సభ్యులందరికీ ఈ సినిమా బాగా నచ్చిందని చెప్పింది. ఆకాశ్ చాలా బాగున్నాడని, లవ్ స్టోరీ చాలా బాగుందని సెన్సార్ సభ్యులు తమతో పదే పదే చెప్పడం తమకు చాలా ఎనర్జీనిచ్చిందని తెలిపింది.