'చంద్రబాబు అనే నేను...' భరత్ ను ఫాలో అయిన సీబీఎన్... వైరల్ అవుతున్న గల్లా జయదేవ్ వీడియో!
- సూపర్ హిట్ అయిన భరత్ అనే నేను టైటిల్ సాంగ్
- చంద్రబాబుకు అన్వయిస్తూ సరికొత్త వీడియో
- ఫేస్ బుక్ లో పోస్టు చేసిన గల్లా జయదేవ్
1996లో హైటెక్ సిటీని చంద్రబాబు ప్రారంభించడం, పాదయాత్ర, వివిధ సంక్షేమ పథకాల వీడియో బిట్లను కలిపారు. పలు సందర్భాల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను, అభివృద్ధి పథకాలు, వివిధ సదస్సుల ఫోటోలు, జాతీయ స్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు, పుష్కరాల ఏర్పాట్లు, ప్రజలతో కలిసున్న చిత్రాలను ఉంచారు. అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఫొటోలను జోడించారు. గల్లా జయదేవ్ తన ఫేస్ బుక్ లో పోస్టు చేసిన ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను మీరూ చూడండి.