గాల్లో వెళుతూ, గాల్లోని లక్ష్యాన్ని ఛేదించిన తేజాస్!
- మరో పరీక్షలో విజయం సాధించిన తేజాస్
- కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదించిన క్షిపణి
- డెర్బీ మిసైల్ ను ప్రయోగించామన్న అధికారులు
కంటికి కనిపించనంత దూరంలో ఉన్న లక్ష్యాన్ని విమానం నుంచి ప్రయోగించిన క్షిపణి తాకిందని, ఆ సమయంలో వింగ్ కమాండర్ సిద్ధార్థ సింగ్, పైలట్ గా ఉన్నారని తెలిపారు. 118 కిలోల బరువున్న డెర్బీ మిసైల్ ను తేజాస్ నుంచి ఆయన ప్రయోగించారని, ఈ పరీక్ష గోవా తీరంలో జరిగిందని వెల్లడించారు. తేజాస్ విమానాలను వాయుసేనకు అందించే ముందు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.