‘భరత్ అనే నేను’ సినిమావి ఒరిజినల్ కలెక్షన్లే.. నేనే ప్రకటించాను: డీవీవీ దానయ్య
- రూ.161.28 కోట్ల గ్రాస్ వచ్చింది
- ఎటువంటి అసత్యం లేదు
- మా సంస్థకు పెద్ద విజయం లభించింది
- కొరటాల శివ, మహేశ్‌కి ధన్యవాదాలు
ఈ సందర్భంగా డీవీవీ దానయ్య మాట్లాడుతూ... తమ సంస్థకు ఇంత పెద్ద విజయం ఇచ్చిన ఈ సినిమా దర్శకుడు, హీరోకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సినిమా నిర్మాణ విషయంలో తాను ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారికి సారీ చెబుతున్నానని పేర్కొన్నారు. ఈ సినిమా తరువాత తనకు మరింత పేరు వచ్చిందని, తాను ఎక్కడ కనిపించినా తనతో చాలామంది ఫొటోలు దిగాలని చూస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.