మూడోసారి రవితేజతో జోడీకట్టనున్న కాజల్!
- 'నేల టిక్కెట్టు'తో రానున్న రవితేజ
- శ్రీను వైట్లతో నెక్స్ట్ మూవీ
- ఆ తరువాత సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
తమిళంలో హిట్ కొట్టిన 'తెరి' మూవీని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ కథను సిద్ధం చేసుకున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను ఎంపిక చేసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో రవితేజ సరసన కాజల్ చేసిన 'వీర' .. 'సారొచ్చారు' సరిగ్గా ఆడలేదు. అందువలన ఈ సినిమా చేయడానికి కాజల్ ఆసక్తిని చూపలేదట. కానీ ఆ తరువాత ఆమెను ఒప్పించారనేది తాజా సమాచారం. ఈ సారి ఈ జంట హిట్ కొడుతుందేమో చూడాలి.