ట్విట్టర్‌లో మహేశ్ బాబు ఫాలో అవుతోన్న వారిలో కొత్తగా మరొకరు!
- నిన్నటివరకు గల్లా జయదేవ్‌ని మాత్రమే ఫాలో అయిన మహేశ్
- నేటి నుంచి ఆ లిస్టులో కొరటాల శివ
- అరుదుగా ట్వీట్లు చేసే మహేశ్
కాగా, మహేశ్ బాబు అరుదుగానే ట్వీట్లు చేస్తుంటాడు. తన కుటుంబం, తన సినిమాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారంపైనే ఆయన ట్వీట్లు ఉంటాయి. ఇటీవల మహేశ్ బాబు తన కొత్త సినిమా సక్సెస్ మీట్‌లో భావోద్వేగంగా మాట్లాడి తనకు హిట్‌నిచ్చిన కొరటాల శివకు థ్యాంక్స్ చెబుతూ హత్తుకున్నారు. ఇన్నాళ్లు ఒక్కరినే ఫాలో అవుతూ వచ్చిన మహేశ్.. ఇప్పుడు కొరటాల శివను ఫాలో అవడం విశేషమే. ట్విట్టర్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న టాలీవుడ్ హీరో మహేశ్ బాబే.
(ఇంతకు ముందు)
(ఈరోజు)