సినిమా సూపర్.. ఫుల్ ఎంజాయ్ చేశా: 'భరత్ అనే నేను'పై కేటీఆర్ ప్రశంసలు
- కేటీఆర్ కోసం 'భరత్ అనే నేను' స్పెషల్ షో
- సినిమా సూపర్ అన్న మంత్రి
- మహేష్, శివలతో ఉన్న ఫొటోలు షేర్
ఈ నేపథ్యంలోనే ఆయన ట్వీట్ చేశారు. తాము మాట్లాడుతున్నప్పటి ఫొటోలను అప్ లోడ్ చేశారు. ప్రజా జీవితం ఎలా ఉంటుందన్న అంశంపై హీరో మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివలతో చర్చలో పాల్గొన్నానని మంత్రి తెలిపారు. మరోవైపు ఈ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.